- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ పాక్ మధ్య నేడే చర్చలు.. ఏం జరగనుంది?
భారత్ పాకిస్థాన్ మధ్య నేడు మద్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంవో(డైరెక్టర్ అండ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్)లు పాల్గొంటారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్థాన్ మధ్య నేడు మద్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంవో(డైరెక్టర్ అండ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్రశిభిరాలను కూల్చివేసిన తరవాత భారత డీజీఎంవో పాక్ డీజీఎంవోకి ఫోన్ చేశారు. కానీ ఆయన చర్చలకు రాలేదు. శనివారం పాక్ డీజీఎంవో భారత్ డీజీఎంవోకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే నేడు శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏం మాట్లాడాలో ఇప్పటికే ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో డీజీఎంవోకు పలు అంశాలను ప్రస్తావించాలని చెప్పినట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తరవాత కూడా పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటూ డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతే కాకుండా సింధూ జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వీటితో పాటూ తీవ్రవాదానికి మద్దతివ్వడం ఆపాలని భారత్ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్చల తరవాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.






