సీజ్‌ఫైర్ కాదు.. అది కాల్పుల విరమణే..!

by Phanindra |

భారత్, పాక్ మధ్య జరిగిన ఒప్పందం సీజ్‌ఫైర్ కాదని, అది కేవలం కాల్పుల విరమణేనని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

సీజ్‌ఫైర్ కాదు.. అది కాల్పుల విరమణే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఇది ‘సీజ్‌ఫైర్’ కాదని, కేవలం రెండు దేశాల మధ్య జరిగిన అంగీకారం మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తవలేదు. ప్రస్తుత పరిస్థితి ఇదే. అందుకే మేం కాల్పుల విరమణ ఒప్పందం అంటున్నారు. దీన్ని కూడా పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రకటన చేసే సమయంలో భారత్ విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కూడా ‘సీజ్‌ఫైర్’ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఈ పదాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించారు. యూఎస్ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరినట్లు తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story