- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pak PM Sheahabaz : భారత్ బ్రహ్మోస్ మిసైల్స్ తో దాడులు చేసింది : పాక్ ప్రధాని
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో (Bharat Air Strikes) తమకు ఎలాంటి నష్టం జరగలేదని ఇన్నాళ్ళు చెప్పుకున్న పాక్.. మెల్లగా అవన్నీ నిజమేనని ఒప్పుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో (Bharat Air Strikes) తమకు ఎలాంటి నష్టం జరగలేదని ఇన్నాళ్ళు చెప్పుకున్న పాక్.. మెల్లగా అవన్నీ నిజమేనని ఒప్పుకుంటోంది. పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్‌లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్(Pakistan PM Shahbaz Sharif) పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాక్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో పాక్ సైన్యం మే 10 ఉదయం ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే, తెల్లవారకముందే తమ వైమానిక స్థావరాలపై భారత్ లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్(Brahmos Missiles) ని ప్రయోగించిందని అన్నారు.
రావల్పిండిలోని ఎయిర్‌బేస్(Ravalpindi AirBase)తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిందని, తాము ఎటాక్ చేసే సమయం కూడా చిక్కలేదని దీంతో పాక్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని అంగీకరించారు. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ అయిన రావాల్పిండికి సమీపంలో ఉన్న నూర్ ఖాన్‌తో పాటు, రఫీకి, మురిద్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్‌లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసింది. స్కార్డు, భోలారి, జకోబాబాద్ మరియు సర్గోధాలోని వైమానిక స్థావరాలు కూడా విస్తృతంగా దెబ్బతిన్నాయి. మొత్తం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.






