Abhinandan Varthaman: బాలాకోట్ లో పాకిస్థాన్ పై నిప్పులు కురిపించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఇఫ్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?

by Vennela |
Abhinandan Varthaman: బాలాకోట్ లో పాకిస్థాన్ పై నిప్పులు కురిపించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఇఫ్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: Abhinandan Varthaman: భారత పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో ఎందరో వీర జవాన్లు తమ ప్రాణాలకు సైతం భయపడకుండా సరిహద్దుల వద్ద శత్రువులను ఎదుర్కొంటూ ఈ దేశాన్ని కాపాడుతున్నారు. అలాంటి సైనికులకు మనమంతా అండగా నిలవాలి. వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సరిగా ఆరేళ్ల క్రితం బాలాకోట్ పై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఆ సమయంలో పాక్ గడ్డపైన ప్రమాదవశాత్తు తన విమానంతో సహా పడిపోయినప్పటికీ, ఓ వీర జవాను ఏ మాత్రం భయపడకుండా మీసం మెలేసాడు.

అతడే అభినందన్ వర్ధమాన్. ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో కెప్టెన్ గా ప్రస్తుతం అభినందన్ సేవలు అందిస్తున్నారు. 2021 లోనే ఆయనకు కెప్టెన్ గా పదోన్నతి లభించింది. ఇది కల్నల్ హోదాకు సమానం అని చెప్పవచ్చు. 2019 సంవత్సరంలో పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని తన మిగ్ - 21 విమానంతో వెంటాడి కూల్ చేసిన ఘనత అభినందన్ సొంతం.

ఈయన మిగ్ 21 బైసన్ స్క్వాడ్రన్ లో సేవలు అందించారు. అయితే 2022 సెప్టెంబర్ లో ఈ స్క్వాడ్రన్ నుంచి ఆయన తప్పుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కెప్టెన్ అభినందన్ ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్న ఉద్రిక్తతలో సైన్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు. అనే అంశం పోయిన తర్వాత చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం అభినందన్ వర్ధమాన్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోరులో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారా లేదా అనేది ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ఎందుకంటే సైనికుల రక్షణ నిమిత్తం ఇలాంటి విషయాలను ఆర్మీ గోప్యంగా ఉంచుతుంది. ప్రస్తుతం ఆయన ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఒక ఉన్నత పదవిలో కొనసాగుతున్నారు అనే సమాచారం ఉంది. ఇదిలా ఉంటే 2019లో కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన యుద్ద విమానంతో సహా పాకిస్తాన్ భూభాగంలో పడిపోగా, పాకిస్తాన్ సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత అతడిని విడిపించేందుకు భారత ప్రభుత్వం శాయశక్తుల కృషి చేయగా, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ చివరకు అభినందన్ వర్ధమాన్ ను వదిలేసింది.

శత్రుదేశంపై ఏమాత్రం భయపడకుండా మీసం మెలేస్తూ అతడు మాట్లాడిన వీడియో ఇప్పటికీ తెగ వైరల్ అవుతుంది అని చెప్పవచ్చు. ఆయన సాహస పరాక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో సత్కరించింది. కెప్టెన్ అభినందన్ భార్య టాన్వి మారియా సైతం ఇండియన్ ఎయిర్ ఫోర్సులోనే పనిచేస్తున్నారు.



Next Story

Most Viewed