- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రవాద నిర్మూలనకు చైనా మద్దతు.. షాక్‌లో పాకిస్తాన్
కశ్మీర్ పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి భారత్ పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు సిద్ధం అయింది.

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి భారత్ (India).. పాకిస్తాన్ (Pakistan) పై ప్రతీకార చర్యలకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా చాకచక్యంగా వ్యవహరించిన భారత్.. పాకిస్తాన్ లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడి (Attack on terrorist centers) చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, యుద్ధ విమానాలు, మిస్సైల్స్‌తో విరుచుకుపడగా.. భారత రక్షణ సిస్టం విజయవంతంగా ఎదుర్కొంది. అలాగే పాక్ పై మెరుపుదాడి చేసి కోలుకోలేని దెబ్బతీసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ మెరుపు దాడికి ప్రపంచ వ్యప్తంగా మద్దతు లభించింది.
పాకిస్తాన్ ఆర్మీ.. భారత సైన్యం (Indian Army)పై చేసిన దాడికి ఒకటి రెండు దేశాలు మినహా ఏ దేశం మద్దతు తెలపకపోగా.. వ్యతిరేకించాయి. అయితే నిన్న మొన్నటి వరకు పాక్ వెన్నుదన్నుగా ఉన్న చైనా (China).. పాక్ కి షాక్ ఇచ్చింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పరస్పర దాడులపై చైనా ఈరోజు ఉదయం స్పందించింది. తాము ఉగ్రవాదులపై దాడులు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది. అలాగే ఇరు దేశాలు సంయమనం పాటించాలని శాంతి చర్చల (Peace talks)తో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అలాగే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా చైనా (China) చెప్పుకొచ్చింది.






