పాకిస్తాన్ పై ఇండియా మెరుపు దాడి.. బలూచిస్తాన్ డాన్సులు.. వీడియో వైరల్

by velandi.Saikiran |

పాకిస్తాన్ ఉగ్రవాదులపై ( Pakistani terrorists ) ఇండియన్ ఆర్మీ ( Indian Army ) మెరుపు దాడి చేసింది. అర్ధరాత్రి 1:44 గంటలక

పాకిస్తాన్ పై ఇండియా మెరుపు దాడి.. బలూచిస్తాన్ డాన్సులు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ఉగ్రవాదులపై ( Pakistani terrorists ) ఇండియన్ ఆర్మీ ( Indian Army ) మెరుపు దాడి చేసింది. అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్తాన్ ఉగ్ర వాదులు ఉన్న తొమ్మిది స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor) ప్రయోగించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఈ ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో పాకిస్థాన్ లో... జనాలు గజ గజ వణికిపోతున్నారు. కానీ అక్కడ ఉన్న బలూచిస్తాన్ ( Balochistan) సైనికులు, జనాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

తమను ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని పాకిస్తాన్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ...దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా కంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాకిస్తాన్ సైనికులు ఎక్కువ సంఖ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో బలూచిస్తాన్ లో సంబరాలు జరిగాయి. డాన్సులు వేస్తూ అక్కడి ప్రజలు , సైన్యం ఎంజాయ్ చేసింది. పాకిస్తాన్ కు ( Pakistan ) తగిన శాస్తి జరిగిందని... వాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో తాజాగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసుకున్న ఇండియన్స్ నవ్వుకుంటున్నారు.

Next Story