Operation Sindoor: పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడానికి మెయిన్ రీజన్ అదే.. సీడీఎస్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఆపరేషన్ సిందూర్‌‌(Operation Sindoor)పై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌(Anil Chauhan) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Operation Sindoor: పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడానికి మెయిన్ రీజన్ అదే.. సీడీఎస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌‌(Operation Sindoor)పై చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌(Anil Chauhan) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం ముఖ్యం కాదని.. ఫలితమే ప్రధానమని అన్నారు. పెహల్గాం ఘటనకు కొన్ని వారాల ముందు పాక్ ఆర్మీ చీఫ్ విషం చిమ్మారు. హిందువులపై వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగితే తట్టుకోలేమని భావించే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని అన్నారు. ఇకనైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాకిస్తాన్‌(Pakistan) ఆపేయాలని సూచించారు. ఉగ్రవాదం పడగ కింద భారత్‌ ఉండబోదని తేల్చిచెప్పారు. న్యూక్లియర్ బ్లాక్‌ మెయిల్‌ను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని సీడీఎస్‌ అన్నారు.

పాకిస్తాన్‌.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే తన విధానంగా మార్చుకుందని విమర్శించారు. కాల్పుల విమరణను ముందుగా పాకిస్థానే కోరిందని, కానీ నీరు రక్తం కలిసి పారవని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ తీరు మారాల్సిందేనని చెప్పారు. ఆపరేషన్‌ సింధూర్ సందర్భంగా చిన్న చిన్న నష్టాలు జరిగిన మాట వాస్తవమే అని తెలిపారు. అయితే ఈ నష్టాలు భారత సైన్యంపై పెద్దగా ప్రభావం చూపవని అన్నారు. సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రీ-లా డైలాగ్‌లో సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీడీఎస్ అనిల్ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story