BREAKING: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

BREAKING: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)‌ను ఆదేశించింది. ఇక ప్రతి ఎయిర్‌పోర్టులోనూ ప్రయాణికులతో సెకండరీ లాడర్ పాయింట్ చెక్ (SLPC) చేయించుకోనున్నారు. అదేవిధంగా టెర్మిలన్ భవనాల్లో సందర్శనకు వచ్చే విజిటర్స్‌పై నిశేధం విధించారు. దేశ వ్యాప్తంగా ప్రయాణికులు చెక్‌-ఇన్, బోర్డింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. షెడ్యూల్ చేయబడిన ఫ్లైట్లు బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందే ఎయిర్‌పోర్టులకు చేరుకోవాలని.. 75 నిమిషాల ముందే వారి చెక్-ఇన్ ముగుస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆర్డర్‌లో ప్రస్తావించారు.

Next Story