టర్కీ,అజర్‌బైజాన్ లకు మరో ఎదురుదెబ్బ..ఇండియన్స్ తో పెట్టుకుంటే అంతే ?

by velandi.Saikiran |

ఇండియా ( INDIA) వర్సెస్ పాకిస్తాన్ ( PAKISTHAN) మధ్య యుద్ధం నేపథ్యంలో.. టర్కీ (Turkey) అలాగే అజర్ బైజాన్ ( Azerbaijan )

టర్కీ,అజర్‌బైజాన్ లకు మరో ఎదురుదెబ్బ..ఇండియన్స్ తో పెట్టుకుంటే అంతే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( INDIA) వర్సెస్ పాకిస్తాన్ ( PAKISTHAN) మధ్య యుద్ధం నేపథ్యంలో.. టర్కీ (Turkey) అలాగే అజర్ బైజాన్ ( Azerbaijan ) తీవ్రంగా నష్టపోతున్నాయి. మన శత్రు దేశమైన పాకిస్తాన్ కు ( Pak) ఆయుధాలు.. ఈ రెండు దేశాలు అడ్డంగా బుక్కయ్యాయి. ముఖ్యంగా టర్కీ.. డ్రోన్స్ ఇచ్చి మరి ఇండియా పై యుద్ధానికి పాకిస్తాన్ దేశాన్ని పంపింది. దీంతో రెచ్చిపోయిన పాకిస్తాన్... ఇండియా పై డ్రోన్స్ ఎగరవేసింది.

వాస్తవానికి టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఇండియా పూర్తి సహకారం అందించింది. కానీ ఆ విషయాన్ని మర్చిపోయిన టర్కీ... ఇండియా పైకి డ్రోన్స్ ఎగరవేసేలా కుట్రలు పండింది. అజర్ బైజాన్ కూడా అదే తరహాలో వ్యవహరించింది. అయితే వాస్తవానికి... ఈ రెండు దేశాలు పర్యాటక ప్రాంతాలు కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు ఇండియన్ ఎక్కువగా వెళుతున్నారు. దానివల్ల వాళ్ళ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

ఎప్పుడైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఈ రెండు దేశాల బాగోతం బయటపడిందో.. మన ఇండియన్స్ కూడా అటువైపు వెళ్లడం మానేశారు. ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 250 శాతం మంది.. అజర్ బైజాన్, టర్కీ కి వెళ్లకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు ఇండియన్ పర్యాటకులు. దీంతో ఈ రెండు దేశాలకు తీవ్రమైన దెబ్బ పడుతోంది.


Next Story