- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ.. 14 మంది సైనికులు హతం
పాకిస్తాన్ కు ( Pakisthan) మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా ఒకవైపు మెరుపు దాడులు చేస్తున్న నేపథ్యంలో... మరోవైపు

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ కు ( Pakisthan) మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా ఒకవైపు మెరుపు దాడులు చేస్తున్న నేపథ్యంలో... మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Balochistan Liberation Army ) రెచ్చిపోయింది. పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టాలని... తాజాగా ఎటాక్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశానికి చెందిన 14 మంది సైనికులను చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.
తాజాగా పాక్ ఆర్మీ వాహనం పై రిమోట్ కంట్రోల్ తో... IED బాంబు ను పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్. ఈ నేపథ్యంలో ఏకంగా 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ముచ్ కుంద్ (Much Kund ) ప్రాంతంలో... ఈ సంఘటన జరిగినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక బుధవారం రోజున అందరు పడుకున్న తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్ర మూకలు ఉన్న తొమ్మిది స్థావరాలలో ఇండియా ( India) అటాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు వందకు పైగా ఉగ్రవాదులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ లో (jammu and kashmir ) పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకార చర్యగా... ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor) నిర్వహించింది ఇండియన్ ఆర్మీ ( Indian Army). ఇక తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటాక్ చేసింది. దీంతో పాకిస్తాన్ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.






