- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్.. డిఫెన్స్ రంగానికి మరో రూ. 50 వేల కోట్లు పెంపు!
భారత్-పాకిస్తాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాకిస్తాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. (Union Budget) బడ్జెట్‌లో డిఫెన్స్ రంగానికి అదనంగా రూ.50 వేల కోట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ అనంతరం రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక ఆయుధాల కొనుగోలు, పరిశోధనలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే సాయుధ దళాల కోసం రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఎఫెక్ట్‌తో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు, అదేవిధంగా చైనా, పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఇప్పుడు అదనంగా నిధులు కేటాయించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 2025-26 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బడ్జెట్ పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభించే చాన్స్ ఉండటంతో.. మొత్తంగా రక్షణ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగే సూచనలు ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డిఫెన్స్ కేటాయింపులు రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వార్షిక బడ్జెట్‌లో 13 శాతం కేటాయించారు. ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని (Pahalgam attack) పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు భారత పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను కాల్చి చంపిన ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా పీఓకే, పాక్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రస్థావరాలను ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయినా కూడా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది.






