- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాహోర్‌లో ఉండకండి.. పాక్‌లో పర్యటిస్తున్న తమ పౌరులకు అమెరికా చూచన
by Ajay Maddhiboyina |
భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్( Oparation sindoor) కొనసాగుతూనే ఉంది.

X
దిశ,వెబ్ డెస్క్: భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్( Oparation sindoor) కొనసాగుతూనే ఉంది. పహల్గామ్ ఘటన తరవాత భారత్ కేవలం ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు వారి స్థావరాలపై దాడులు జరిపింది. కానీ పాకిస్థాన్ ఆర్మీ(Pakistan army) కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఎదురుదాడులకు పాల్పడటంతో భారత్ ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే పాక్‌లోని పలు నగరాల్లోని ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో అమెరికా అలర్ట్ అయ్యింది. పాకిస్థాన్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. లాహోర్ వీడాలని తమ పౌరులకు సూచించింది. పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న అమెరికన్ యాత్రికులు కూడా షెల్టర్లలోకి వెళ్లాలని ఆదేశించింది. లాహోర్ ఎయిర్‌పోర్ట్ పరిసరాలు ఖాళీ చేయాలని ఆదేశించింది.
Next Story






