ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ది లయన్ కింగ్(The Lion King)’ ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ది లయన్ కింగ్(The Lion King)’ ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’(Mufasa: The Lion King) గత ఏడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. చిన్న పిల్లలతో పాటు పెద్దల్నీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. డైరెక్టర్ బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద స్టోరీని సింహాలకు అన్వయిస్తూ తెరపై చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న వచ్చి హిట్‌గా నిలిచింది.

అంతేకాకుండా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక పలు బాషల్లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ అందించగా.. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), చిన్నప్పటి రోల్‌కు ఆయన కొడుకు అబ్రహం తన ఘాత్రాన్ని ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న సిని ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story