Fear : సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’

by sudharani |
Fear : సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’
X

దిశ, సినిమా: హీరోయిన్ వేదిక(Vedika) చాలా గ్యాప్ తర్వాత ‘ఫియర్’(Fear) చిత్రంతో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి హరిత గోగినేని (Haritha Gogineni)దర్శకత్వం వహించగా.. డిసెంబర్14న రిలీజై అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్‌గా ఈ మూవీ ఓటీటీ(OTT)లోకి దర్శనమిచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ‘ఫియర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ (psychological suspense thriller) బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ(Arvind Krishna), పవిత్రా లోకేష్ (Pavitra Lokesh), జయప్రకాష్ (Jayaprakash), అనీల్ కురువిల్లా (Anil Kuruvilla) కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ థియేటర్‌లలో రిలీజ్ కాకముందే పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను అందుకుంది. మరి థియేటర్‌లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed