- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి శర్వానంద్-కృతి ‘మనమే’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
by Mallepaka Hamsa |
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. దీనిని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించగా.. ఇందులో సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి, ఆయేషా ఖాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ జూన్ 7న విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ శర్వా-కృతి జంటగా నటించిన సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మనమే సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకోగా.. జూలై 12 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
Next Story






