- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Robin Hood: థియేటర్లలో తుస్సు కానీ ఓటీటీలో ఊహించని రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి ఓకే ఓకే అనిపించుకుంది. ఇక ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం మే 10 నుండి జీ5(ZEE5)లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే థియేటర్లలో ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను మాత్రం ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ‘రాబిన్‌హుడ్’ జీ5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ‘రాబిన్‌హుడ్’ 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో సరి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అలా ప్రెజెంట్ ఈ మూవీ యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోయింది.






