- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఓటీటీలోకి రాబోతున్న ‘పుష్ప-2’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? (ట్వీట్)

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్(Fahad Fazil), జగపతి బాబు(Jagapathi Babu), సునీల్, అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. దీనిని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే స్థాయిలో వివాదాలు కూడా ఎదుర్కొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డ్స్ కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇటీవల రీలోడెడ్ వెర్షన్‌ను మేకర్స్ థియేటర్స్‌లోకి తీసుకువచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ‘పుష్ప-2’ చిత్రం జనవరి 30 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ పోస్ట్ చూసిన వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
#Pushpa2 • 30th January • Netflix • All languages 🔥 pic.twitter.com/UvTSk8H4rf
— 𝗙𝗶𝗹𝗺𝘆 𝗩𝗶𝗲𝘄 (@filmy_view) January 21, 2025