అప్పుడే ఓటీటీలోకి కింగ్‌డమ్ సినిమా.. ఏ తేదీన స్ట్రీమింగ్ కానుందంటే..?

by Chukka Sudharani |

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లేటెస్ట్ హిట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom movie).

అప్పుడే ఓటీటీలోకి కింగ్‌డమ్ సినిమా.. ఏ తేదీన స్ట్రీమింగ్ కానుందంటే..?
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లేటెస్ట్ హిట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom movie). అన్నాతమ్ముళ్ల సెంటిమెంట్ డ్రామాగా తెరపై మెరిసిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జులై 31న రిలీజై మంచి హిట్ సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజై రెండు వారాలు కావొస్తుండగా.. దీనికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ రిలీజ్‌పై లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. కింగ్‌డమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు 28 నుంచి కింగ్‌డమ్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే పనిలో ఉందట సంస్థ. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story