- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచి ఇప్పటికీ తండేల్ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. అయితే తాజాగా తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాతనే ఓటీటీలోకి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని సమాచారం.
ఈ నేపథ్యంలో మార్చి 06న లేదా 0 7న తండేల్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే తండేల్ కు థియేటర్లలో మంచి కలెక్షన్లు వస్తుండడంతో ఓటీటీలోకి ఆలస్యంగా వస్తుందేమో నన్న మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.






