- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈరోజు నుంచి ఓటీటీలో రానున్న సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “నెట్‌వర్క్”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
శ్రీకాంత్ శ్రీరామ్(Srikath Sriram), కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని(Priya Vadlamani), శ్రీనివాస్ సాయి(Srinivas Sai) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘నెట్‌వర్క్’(Network).

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాంత్ శ్రీరామ్(Srikath Sriram), కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని(Priya Vadlamani), శ్రీనివాస్ సాయి(Srinivas Sai) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘నెట్‌వర్క్’(Network). ఇక దీనికి సతీష్‌చంద్ర నాదెళ్ల(Sathish Chandra Nadella) దర్శకత్వం వహించగా.. రమ్య సినిమా పతాకంపై లావణ్య యన్‌ఎస్, ఎంజీ జంగం నిర్మించారు. ఇక ఇందులో తాగుబోతు రమేష్, సమ్మెట గాంధీ, జోష్ రవి, మీనా కుమారి, ఛత్రపతి శేఖర్, శివ (హిట్ 2), పద్మాంజలి, కల్పలత (పుష్ప తల్లి), జెమినీ సురేష్, సిద్ధార్థ మీనన్, మహేష్ విట్టా, శివాని, మహి, మౌనిక రెడ్డి, జబర్దస్త్ ఫణి, చిత్రం శ్రీను, సుమన్ సెట్టి, ఫన్ బకెట్ భార్గవి, ఫన్ బకెట్ ఫణి లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించడం విశేషం. అయితే ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై భారీ అంచనాలను పెంచగా.. తాజాగా నేటి నుంచి ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీ(AHA OTT)లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి నేటి నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌ను ఈ వీకెండ్‌లో అస్సలు మిస్ అవ్వద్దు. కాగా ఈ సిరీస్‌కు శేఖర్‌చంద్ర(Shekhar Chandra) సంగీతాన్నందించారు.






