- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎప్పటికీ గుర్తుండిపోవాలని తొలిఓటును వెరైటీగా వేసిన యువకుడు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తయ్యాయి. మిగిలిన రాష్ట్రాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రధాన పార్టీలు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే, ప్రచారంలో అభ్యర్థులు వింత చేష్టలు చేయడం కామన్. చిన్న పిల్లలకు స్నానం చేయించడం, రోడ్లపై దోశలు వేయడం, కూలీ పనిచేయడం, రిక్షా తొక్కడం, ఐరన్ చేయడం వంటివి చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే తరహాలో ఓ యువకుడు కూడా ఆలోచించాడు.
తొలిసారి వేసిన ఓటు ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేశాడు. దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. బిహార్ రాష్ట్రంలోని ఉజియార్‌పూర్ లోక్‌సభ స్థానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. దాంతో తన తొలి వేటు ఎప్పటికీ గుర్తుండాలని వినూత్నంగా ఆలోచించి అలా చేశాడు. స్థానిక యువకులు దీనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. దీంతో ఎప్పటికీ గుర్తుండిపోవడమే కాదు.. ఇండియా మొత్తం తెలిసేలా చేసి నీకు పాపులారిటీ ఇస్తామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
#Watch: It Was His First Vote. So He Rode A Buffalo To Polling Station#ElectionsWithNDTV #Bihar pic.twitter.com/w482IhHQpi
— NDTV (@ndtv) May 13, 2024