- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ipl: గుజరాత్, ముంబై కెప్టెన్ల మధ్య గొడవ.. వీడియో వైరల్
గుజరాత్, ముంబై కెప్టెన్ల మధ్య గొడవ జరిగినట్లు వీడియో వైరల్ అవుతోంది...

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్(IPL)లో గుజరాత్(Gujarat)పై 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రెండు జట్ల కెప్టెన్లు మధ్య గొడవ జరిగినట్లు వైరల్ అవుతోంది. కాాగా ఐపీఎల్‌లో శుక్రవారం కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎవరు ఓడిపోయినా ఎలిమినేట్ అవుతారు. దీంతో ఎంతో ఉత్కంఠగా మ్యాచ్ జరిగింది. గుజరాత్ ఓడిపోయింది.. ముంబై గెలిచింది. దీంతో ముంబై ఇండియన్స్ క్వాలిఫియర్-2కు వెళ్లిపోయారు. అయితే ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. గుజరాత్ కెప్టెన్ గిల్, ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. టాస్ వేసిన సమయంలో సాధారణంగా ఇద్దరు కెప్టెన్లు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ ఇద్దరు అలా చేయలేదు. టాస్ అయిపోయిన వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కాబోలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇద్దరి మరి జరిగిన కథ ఏంటో త్వరలో బయటకు వస్తుందేమో చూడాలి.






