IPL 2025: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |

నెలరోజుల పాటు క్రికెట్ అభిమానులను(Cricket Fans) ఎంతో అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) ముగిసింది.

IPL 2025: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నెలరోజుల పాటు క్రికెట్ అభిమానులను(Cricket Fans) ఎంతో అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా(Team India) సెన్సేషనల్ విక్టరీ సాధించింది. గతేడాది టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత్.. తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీ(ఛాంపియన్స్ ట్రోఫీ)ని దక్కించుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సంబురాలు జరుపుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇక అందరి కన్ను ఐపీఎల్‌(IPL 2025)పై పడింది. మార్చి 22వ తేదీ నుంచి సీజన్ ప్రారంభం కాబోతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ(Union Health Ministry) బీసీసీఐ(BCCI)తో పాటు ఐపీఎల్‌ చైర్మన్‌(IPL Chairman)కు లేఖ రాసింది. ఆ యాడ్స్‌(Prohibited Advertisements)తోపాటు క్రీడాకారులు, కామెంటేటర్లు కూడా ప్రమోట్ చేయడానికి వీళ్లేద్దని లేఖలో పేర్కొంది. ఐపీఎల్‌ను యూత్ ఎక్కువగా చూస్తుండటంతో పొగాకు, మద్యం యాడ్స్ ప్రభావం వారిపై పడే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ రాసిన లేఖలో పేర్కొన్నది. కాగా, ఈ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ మార్చి 22న ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరుబోతుండగా, మార్చి 23న రెండో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనుంది.

Next Story