నో ఛాన్స్.. ఎదురు చూపుల్లోనే సీజన్ ముగించిన కుర్రప్లేయర్లు!

by Phanindra |

ఫామ్‌లో ఉన్నా కూడా కొందరు ప్లేయర్లు ఐపీఎల్ 2025లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. ఫ్రాంచైజీలు వారిని బెంచ్‌లకే పరిమితం చేశాయి.

నో ఛాన్స్.. ఎదురు చూపుల్లోనే సీజన్ ముగించిన కుర్రప్లేయర్లు!
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో ఆడాలని చాలామంది ప్లేయర్లు కలలు కంటారు. టోర్నీకి ముందు ఎంతో ఎగ్జయింటింగ్‌గా ఎదురు చూస్తుంటారు. వీళ్లపై కొన్ని జట్లు ఇంట్రస్ట్ కూడా చూపిస్తాయి. కానీ చివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సీజన్ ముగించేస్తారీ ట్యాలెంటెడ్ ప్లేయర్లు. అలా ఫామ్‌లో ఉన్నా కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒక్క మ్యాచూ ఆడకుండానే టోర్నీ ముగించేస్తున్న కొందరు ప్లేయర్లున్నారు. వాళ్లెవరంటే..

శ్రేయాస్ గోపాల్

గతంలో ఐపీఎల్‌లో అడపా దడపా అవకాశాలు దక్కించుకున్న శ్రేయాస్ గోపాల్.. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 10 ఇన్నింగ్సుల్లో కేవలం 4.98 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఐపీఎల్‌లో కూడా తను రాణిస్తాడని అంతా అనుకున్నారు. అయితే రూ.30 లక్షలకు అతన్ని కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం.. శ్రేయాస్‌ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. జడేజా, నూర్ అహ్మద్, అశ్విన్‌లనే ఆడించిన ధోనీ.. శ్రేయాస్‌ను బెంచ్‌కే పరిమితం చేశాడు.

అర్షిన్ కులకర్ణి

గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌కు కొన్ని మ్యాచుల్లో ఓపెనింగ్ చేసిన అర్షిన్ ఫెయిలయ్యాడు. ఆ తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 194 పరుగులు, ఆరు వికెట్లతో అర్షిన్ రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా రెండు సెంచరీలు సాధించడంతోపాటు ఎకనామికల్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని లక్నో మళ్లీ కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు.

రాజ్‌వర్ధన్ హంగర్కేకర్

2022 అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన రాజ్‌వర్ధన్‌‌ను.. మూడు సీజన్లలలో చెన్నై కొనుగోలు చేసింది. కానీ అతను ఆడింది రెండు ఐపీఎల్ మ్యాచులే. అద్భుతమైన పేస్‌తో బౌలింగ్ చేసే అతన్ని ఈసారి లక్నో కొనుగోలు చేసింది. ఆ టీం ప్రధాన బౌలర్లకు గాయాలవడంతో కచ్చితంగా రాజ్‌వర్ధన్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ పంత్ మాత్రం అతన్ని ఒక్క మ్యాచులో కూడా తీసుకోలేదు.

స్వస్తిక్ చికారా

కోహ్లీ ఫ్యాన్ బాయ్‌గా వైరల్ అవుతున్న చికారా.. గతేడాది యూపీ టీ20 లీగ్‌లో అద్భుతంగా ఆడి పేరు సంపాదించాడు. 12 ఇన్నింగ్సుల్లో 185.5 స్ట్రైక్ రేటుతో 499 పరుగులు చేశాడీ కుర్ర బ్యాటర్. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఈ బిగ్ హిట్టర్‌ను ఒక్క మ్యాచులో అయినా ఆర్సీబీ ఆడిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పటీదార్ అండ్ కో మాత్రం అతన్ని బెంచ్‌కే పరిమితం చేశారు.

మయాంక్ మార్కండే

తన తొలి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా ఆడిన మార్కండే.. ఆ తర్వాత కొంత తడబడినా గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున చక్కగా రాణించాడు. అయితే ఆ జట్టు అతన్ని రిలీజ్ చేసేయడంతో మెగా వేలంలో కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసింది. అద్భుతమైన స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నా కూడా వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఉండటంతో మార్కండేకు ఈ టీంలో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు.

వీరే కాకుండా కేవలం ఒకటి, రెండు మ్యాచులే ఆడి మిగతా మ్యాచులకు దూరమైన స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. నటరాజన్ వంటి అద్భుతమైన పేసర్‌కు కూడా ఢిల్లీ జట్టులో రెగ్యులర్‌గా ఆడే అవకాశం దక్కలేదు. కానీ పొటెన్షియల్ చూపించిన ఈ కుర్రాళ్లకు కనీసం తమ సత్తా చూపించుకునే అవకాశమైనా దక్కాల్సింది.

Next Story