మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న SRH టీం.. మా చిరుతపులి ఎక్కడా? అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gantepaka Srikanth |

ఐపీఎల్‌-2025 సీజన్‌(Indian Premier League) హాట్ హాట్‌గా జరుగుతోన్న వేళ కాస్త చిల్ అయ్యేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) టీం మాల్దీవుల(Maldives)కు వెళ్లింది.

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న SRH టీం.. మా చిరుతపులి ఎక్కడా? అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌-2025 సీజన్‌(Indian Premier League) హాట్ హాట్‌గా జరుగుతోన్న వేళ కాస్త చిల్ అయ్యేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) టీం మాల్దీవుల(Maldives)కు వెళ్లింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా యాజమాన్యం తెలియజేసింది. మంగళవారం ఫ్యామిలీలతో గ్రూప్ ఫొటో దిగిన ప్లేయర్ల ఫొటోను విడుదల చేసింది. అయితే.. ఈ ఫొటోలో యంగ్ డైనమైట్, మా చిరుతపులి అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఎక్కడ? అంటూ నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు ఓకే.. మరి మ్యాచుల సంగతేంటి?.. మిలిగిన అన్ని మ్యాచులు గెలిచేలా వ్యూహం ఉందా? లేదా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. ఇప్పటివరకు ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచులు ఆడిన హైదరాబాద్(SRH) జట్టు.. కేవలం మూడింట్లోనే గెలిచింది. మిగిలిన ఆరు మ్యాచుల్లో అతి దారుణంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ విఫలమై ఓటమి చెందారు. మిగిలిన అన్ని మ్యాచుల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.




Next Story