రబాడ తీసుకున్న డ్రగ్ అదే.. మాకు తెలియాలంటున్న ఫ్యాన్స్..!

by Phanindra |

డ్రగ్స్ వాడకం వల్ల నిషేధానికి గురైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ. అతను తీసుకున్న డ్రగ్ కొకైన్ అంటూ కథనాలు.

రబాడ తీసుకున్న డ్రగ్ అదే.. మాకు తెలియాలంటున్న ఫ్యాన్స్..!
X

దిశ, స్పోర్ట్స్: సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నెల రోజుల నిషేధం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడనున్న సంగతి తెలిసిందే. అతను డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడం వల్ల మూడు నెలల నిషేధం విధించారు. అయితే ఆ తర్వాత ఈ నిషేధాన్ని నెలరోజులకు కుదించడంతో ఐపీఎల్ ఆడేందుకు రబాడకు అనుమతి లభించింది. రబాడ తీసుకున్నది పెర్ఫామెన్స్ పెంచే డ్రగ్ కాదని, రిలక్స్ అయ్యేదని రిపోర్టులు వచ్చాయి. అయితే అసలు అతను తీసుకున్న డ్రగ్ ఏంటనే విషయం మాత్రం బయటకురాలేదు.

తాజాగా సౌతాఫ్రికా వర్గాలు ఈ విషయంపై స్పందించినట్లు సమాచారం. రబాడ తీసుకున్నది కొకైన్ అని, ఎస్ఏ20 (సౌతాఫ్రికా టీ20) లీగ్ ప్రారంభానికి ముందే తను ఈ డ్రగ్ తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఎస్ఏ20 లీగ్ సమయంలో రబాడ ఎలాంటి డ్రగ్ తీసుకోలేదని అతని లాయర్లు వాదించారట. అతని టెస్టుల్లో బెంజోలెగొనైన్ (బీజడ్‌ఈ) మిల్లీలీటరుకు వెయ్యి నానోగ్రాముల కన్నా తక్కువే ఉందని ఆధారాలు కూడా చూపించినట్లు సమాచారం.

అయితే దీనిపై ఎలాంటి ధ్రువీకరణ రాకపోవడంపై క్రికెట్ అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. రబాడ వంటి స్టార్ ప్లేయర్‌పై నిషేధం పడినప్పుడు, అతను ఎలాంటి డ్రగ్ తీసుకున్నాడో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కు ఉంటుందని అంటున్నారు.

Next Story