అయ్యర్‌కు కాకుండా డగౌట్‌లో ఉన్న వ్యక్తికి ప్రశంసలు.. గంభీర్‌‌కు చురకలంటించిన గవాస్కర్

by Harish |

గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

అయ్యర్‌కు కాకుండా డగౌట్‌లో ఉన్న వ్యక్తికి ప్రశంసలు.. గంభీర్‌‌కు చురకలంటించిన గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ క్రెడిట్ అయ్యర్‌ కంటే ఎక్కువగా ఆ సీజన్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా ఉన్న గంభీర్‌కు దక్కిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేకేఆర్ అయ్యర్‌‌ను వదులుకోవడం కూడా ఆ ప్రచారానికి బలానిచ్చింది. అయితే, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను అయ్యర్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. 11 ఏళ్ల పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కే చేర్చాడు.

ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా గంభీర్‌కు చురకలంటించాడు. ‘గత సీజన్‌లో కోల్‌కతాకు టైటిల్ అందించినా శ్రేయస్‌కు తగిన క్రెడిట్ దక్కలేదు. ప్రశంసలన్నీ మరొకరికి దక్కాయి. జట్టు విజయాల్లో కెప్టెన్‌దే ప్రధాన పాత్ర. డగౌట్‌లో కూర్చున్న వ్యక్తిది కాదు.’ అని వ్యాఖ్యానించాడు. ఈ సారి అయ్యర్‌కు మంచి పేరు వస్తోందని, కోచ్ రికీ పాంటింగ్‌కు ఎవరూ క్రెడిట్ ఇవ్వడం లేదన్నాడు. ఈ సీజన్‌లో అయ్యర్ కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గానూ సత్తాచాటుతున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 435 రన్స్ చేశాడు.


Next Story