KKR vs PKBS: టాస్ గెలిచిన పంజాబ్ జట్టు

by Gantepaka Srikanth |
KKR vs PKBS: టాస్ గెలిచిన పంజాబ్ జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2025(IPL 2025)లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఛండీఘర్‌ మైదానం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా కోల్‌కతా కింగ్స్ బౌలింగ్ చేయబోతున్నది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఆరు మ్యాచులు ఆడిన కోల్‌కతా.. మూడింట్లో గెలిచి, మూడింట్లో ఓడింది. ఇక ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ జట్టు మూడు మ్యాచుల్లో గెలిచి.. రెండింట్లో ఓడింది. ఈ మ్యాచ్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

కోల్‌కతా : సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.

పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైషక్ విజయ్‌కుమార్.



Next Story

Most Viewed