- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబై సూపర్ విక్టరీ.. ఢిల్లీ వరుస విజయాలకు బ్రేక్
ఢిల్లీ(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై(Mumbai Indians) ఘన విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై(Mumbai Indians) ఘన విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేసింది. రోహిత్(18), రికెల్టన్(41), సూర్యకుమార్ యాదవ్(40), తిలక్ వర్మ(59), నమన్ ధీర్(38) అదరగొట్టారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, కుల్డీప్ చెరో రెండేసి వికెట్లు తీయగా, ముకేష్ కుమార్ ఒక వికెట్ తీశారు.
ఇక 206 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ బ్యాటర్లు కూడా బాగానే రాణించారు. అభిషేక్ పోరెల్(33), కరుణ్ నాయర్(89), రాహుల్(15), నిఘమ్(14) పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. మొత్తంగా 19 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ మూడు వికెట్లు, మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు, దీపర్ చాహర్, బూమ్రా తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన ఢిల్లీ.. ఒకటి ఓడి.. నాలుగింట్లో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన ముంబై.. నాలుగింట్లో ఓడిపోయి.. రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.






