ముగ్గురు ప్లేయర్లతో ముంబై డీల్.. ప్లేఆఫ్స్ ఆడితే రూ.5.25 కోట్లా?

by Phanindra |

ప్లేఆఫ్స్ సమయంలో అందుబాటులో ఉండని ప్లేయర్ల స్థానంలో ముగ్గురు ప్లేయర్లతో ముంబై డీల్ కుదుర్చుకుంది. బెయిర్‌స్టోకు కేవలం ప్లేఆఫ్స్ ఆడితే రూ.5.25 కోట్లు చెల్లించనుంది.

ముగ్గురు ప్లేయర్లతో ముంబై డీల్.. ప్లేఆఫ్స్ ఆడితే రూ.5.25 కోట్లా?
X

దిశ, స్పోర్ట్స్: ప్లేఆఫ్స్ కోసం ముంబై ఇండియన్స్ పక్కాగా సిద్ధం అవుతోంది. తమ తదురపరి మ్యాచ్‌లో ఢిల్లీని ఢీకొట్టబోతున్న ముంబై.. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది. కానీ ఆ టీంలోని కీ ప్లేయర్లు విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్ ముగ్గురూ కూడా ప్లేఆఫ్స్ సమయంలో అందుబాటులో ఉండరు. విండీస్‌తో ఇంగ్లండ్ వన్డే సిరీస్ కోసం జాక్స్ వెళ్లిపోతాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాల కోసం రికెల్టన్, బాష్ వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి రిప్లేస్‌మెంట్ కోసం జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ ఆశలంకతో ముంబై ఒప్పందం చేసుకుంది.

వీరిలో జానీ బెయిర్‌స్టో కేవలం ప్లేఆఫ్స్ ఆడటానికి రూ.5.25 కోట్లు తీసుకోనున్నాడు. గ్లీసన్‌తో రూ.కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్న ముంబై.. రూ.75 లక్షలతో శ్రీలంక కెప్టెన్ చరిత్ ఆశలంకను జట్టులోకి తీసుకుంది. ప్లేఆఫ్స్ సమయంలో ముగ్గురూ సత్తా చాటుతారని ముంబై భావిస్తోంది.

Next Story