Mumbai Indians: ఇకపై జరిగే ప్రతి మ్యాచూ మాకు ప్లేఆఫే: మహేల జయవర్దనే

by Phanindra |

గుజరాత్ చేతిలో ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో ప్రతి మ్యాచునూ ప్లేఆఫ్స్‌లా చూస్తామని జయవర్దనే చెప్పాడు.

Mumbai Indians: ఇకపై జరిగే ప్రతి మ్యాచూ మాకు ప్లేఆఫే: మహేల జయవర్దనే
X

దిశ, స్పోర్ట్స్: గుజరాత్ చేతిలో ఓటమితో ముంబై (Mumbai Indians) ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కఠినంగా మారాయి. ప్రస్తుతం ఏడు జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం ఏ జట్టుకైనా కష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ముంబై వద్ద ప్రస్తుతం 14 పాయింట్లే ఉన్నాయి. ఈ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండూ కచ్చితంగా గెలిస్తేనే ముంబై ఎలాంటి సమస్యలు లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. లేదంటే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో ఇకపై తాము ఆడే ప్రతి మ్యాచ్‌ను ప్లేఆఫ్స్‌లాగే భావిస్తామని ముంబై హెడ్‌కోచ్ మహేల జయవర్దనే (Mahela Jayawardene) చెప్పాడు. సీజన్ ఆరంభంలో ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు పరాజయాలతో ఇబ్బంది పడిన ముంబై.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. గుజరాత్ చేతిలో ఓటమి ఆ జట్టు జోరుకు బ్రేకులు వేసింది. ఈ క్రమంలో తాము మళ్లీ పుంజుకుంటామని, సీజన్ ద్వితీయార్థంలో చూపించిన ఫామ్ కొనసాగిస్తామని జయవర్దనే ధీమా వ్యక్తంచేశాడు.

Next Story