- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MI vs GT: ముంబైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ.. టేబుల్ టాపర్ జీటీనే
వరుసగా ఆరు విజయాల తర్వాత ముంబై ఇండియన్స్ తొలి ఓటమి చవిచూసింది. ముంబైపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

దిశ, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం కొనసాగించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. బంతితో మెరుపు ఆరంభం దక్కినా.. ఆ తర్వాత చేతుల్లోకి వచ్చిన క్యాచులను గుజరాత్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. అయితే ఆ తర్వాత జీటీ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని 155 పరుగులకే కట్టడి చేశారు. ఛేజింగ్‌ను ఆచితూచి ఆరంభించిన గుజరాత్.. ఒకానొక దశలో సులభంగా గెలిచేలా కనిపించింది. అలాంటి సమయంలో వర్షం వల్ల మ్యాచ్ ఆగింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు రెచ్చిపోయారు. వేసిన ప్రతి ఓవర్లో ఒక వికెట్ తీసుకుంటూ గుజరాత్ పతనాన్ని శాసించారు. ఇలాంటి సమయంలో మరోసారి వర్షం పడింది. దీంతో గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లకు 147గా అంపైర్లు కుదించారు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన స్థితిలో చెలరేగిన గుజరాత్.. థ్రిల్లింగ్ విక్టరీతో రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆరంభంలో జీటీ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్ ముంబైని దెబ్బతీశారు. రికెల్టన్ (2), రోహిత్ శర్మ (7) ను పెవిలియన్ చేర్చారు. అయితే ఆ తర్వాత గుజరాత్ ఫీల్డింగ్ తేలిపోయింది. సాయి సుదర్శన్, సాయి కిశోర్, మహమ్మద్ సిరాజ్.. చేతుల్లోకి వచ్చిన క్యాచులు నేలపాలు చేశారు. ఈ అవకాశాల్ని ఉపయోగించుకున్న విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) రాణించారు. అయితే ఆ తర్వాత గుజరాత్ స్పిన్నర్లు పట్టుబిగించారు. ముంబై బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా చెలరేగారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే ముంబై నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయలో కార్బిన్ బాష్ (27) తనదైన స్టైల్లో ఆడి ముంబై జట్టు స్కోరును 155/8కి చేర్చాడు.
ఆచితూచి ఆడిన జీటీ..
ఛేజింగ్‌లో గుజరాత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ (5)ను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. దీంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిన శుభ్‌మన్ గిల్ (43), జోస్ బట్లర్ (30) నెమ్మదిగా ఆడారు. అయితే బట్లర్ అవుటైన తర్వాత వచ్చిన రూథర్‌ఫర్డ్ (28) వేగంగా ఆడటంతో గుజరాత్ 14 ఓవర్లకు 107/2 స్కోరుతో నిలిచింది. ఆ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అనంతరం మ్యాచ్ ప్రారంభమైనా మళ్లీ వర్షం పడే అవకాశం ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుమ్రా, బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో గుజరాత్ దాదాపు ప్రతి ఓవర్లో ఒక వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు గుజరాత్ 132/6 స్కోరు వద్ద ఉండగా మరోసారి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
ఓవర్ తగ్గించిన అంపైర్లు..
వర్షం అంతరాయం వల్ల మ్యాచ్‌ను 19 ఓవర్లకు అంపైర్లు కుదించారు. దీంతో గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147కు సవరించారు. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన సమయంలో తెవాటియా ఒక ఫోర్, కోట్జీ ఒక సిక్స్ బాదడంతో గుజరాత్ ఊపిరి పీల్చుకుంది. దానికితోడు చాహర్ ఈ ఓవర్లో ఒక నోబాల్ కూడా వేయడంతో చివరి బంతికి గుజరాత్ విజయాన్నందుకుంది.
స్కోరు బోర్డు:
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ర్యాన్ రికెల్టన్ (సి) సాయి సుదర్శన్ (బి) మహమ్మద్ సిరాజ్ 2, రోహిత్ శర్మ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అర్షద్ ఖాన్ 7, విల్ జాక్స్ (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ ఖాన్ 53, సూర్యకుమార్ యాదవ్ (సి) షారుఖ్ ఖాన్ (బి) సాయి కిశోర్ 35, తిలక్ వర్మ (సి) శుభ్‌మన్ గిల్ (బి) కోట్జీ 7, హార్దిక్ పాండ్యా (సి) శుభ్‌మన్ గిల్ (బి) సాయి కిశోర్ 1, నమన్ ధీర్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) ప్రసిధ్ కృష్ణ 7, కార్బిన్ బాష్ (27 రనౌట్), దీపక్ చాహర్ (8 నాటౌట్), కర్ణ్ శర్మ (1 నాటౌట్)
ఎక్స్‌ట్రాలు : 7
బౌలింగ్: మహమ్మద్ సిరాజ్ (3-0-29-1), అర్షద్ ఖాన్ (3-0-18-1), ప్రసిధ్ కృష్ణ (4-0-37-1), సాయి కిశోర్ (4-0-34-2), రషీద్ ఖాన్ (4-0-21-1), గెరాల్డ్ కోట్జీ (2-0-10-1)
గుజరాత్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 5, శుభ్‌మన్ గిల్ (బి) బుమ్రా 43, జోస్ బట్లర్ (సి) రికెల్టన్ (బి) అశ్వనీకుమార్ 30, రూథర్‌ఫర్డ్ (ఎల్బీడబ్ల్యూ) బౌల్ట్ 28, షారుఖ్ ఖాన్ (బి) బుమ్రా, రాహుల్ తెవాటియా (11 నాటౌట్), రషీద్ ఖాన్ (ఎల్బీడబ్ల్యూ) అశ్వనీకుమార్ 2, గెరాల్డ్ కోట్జీ (సి) నమన్ ధీర్ (బి) దీపక్ చాహర్ 12, అర్షద్ ఖాన్ (1 నాటౌట్)
ఎక్స్‌ట్రాలు : 9
బౌలింగ్: దీపక్ చాహర్ (3-0-32-1), ట్రెంట్ బౌల్ట్ (4-0-22-2), జస్ప్రీత్ బుమ్రా (4-0-19-2), హార్దిక్ పాండ్యా (1-0-18-0), కర్ణ్ శర్మ (2-0-13-0), అశ్వనీ కుమార్ (4-0-28-2), విల్ జాక్స్ (1-0-15-0)






