IPL 2025: చితక్కొట్టిన గుజరాత్.. ముంబై ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IPL 2025: చితక్కొట్టిన గుజరాత్.. ముంబై ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium) వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా.. గుజరాత్ ముందు బ్యాటింగ్ చేసింది. గుజరాత్ బ్యాటర్లంతా వచ్చిన వచ్చినట్లే చితక్కొట్టారు. సాయి సుదర్శన్(63), శుభ్‌మన్ గిల్(38), జాస్ బట్లర్(39) అద్భుతంగా రాణించారు. మిగిలిన ప్లేయర్లు కూడా పర్వాలేదు అనిపించారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేశారు. ముంబై విజయలక్ష్యం 197 పరుగులు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహార్, ముజీబ్, సత్యనారాయణ రాజు తలో వికెట్ తీశారు.

Next Story