- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదాపై కీలక నిర్ణయం!
ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (IPL 2025) ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు (మే 10) ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ చూడటానికి టికెట్ కొనుగోలు చేసిన వారికి టికెట్ డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు ఎస్ఆర్‌హెచ్ తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వెల్లడించింది. ‘ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఐపీఎల్ 2025 తక్షణమే నిలిపివేశారు. టికెట్ వాపసు వివరాలు త్వరలో తెలియజేస్తాము’ అని ఎస్ఆర్‌హెచ్ (SRH) పేర్కొంది.
కాగా, భారత్- పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో (Indian Premier League-2025) ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 ను బీసీసీఐ (BCCI) నిరవధిక వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. దాదాపు వారం రోజుల పాటు జరిగే అన్ని మ్యాచ్‌లు వాయిదా వెయనున్నట్లు వెల్లడించారు. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విషయానికి వస్తే ఐపీఎల్-2025 పోటీల నుంచి బయటకు వచ్చేసింది. ఈ ఏడాది ఆరెంజ్ ఆర్మీ అపజయాలు చవి చూడటంతో ప్లేఆఫ్స్ రేసుకు వెళ్లలేకపోయింది.






