ఐపీఎల్ ప్లేయర్ రిప్లేస్‌మెంట్ రూల్స్ మార్పు

by Phanindra |

ఐపీఎల్ ప్లేయర్ రిప్లేస్‌మెంట్ రూల్స్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. కొందరు ప్లేయర్లు అందుబాటులో ఉండకపోవడం వల్లనే ఈ నిర్ణయం.

ఐపీఎల్ ప్లేయర్ రిప్లేస్‌మెంట్ రూల్స్ మార్పు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025 మళ్లీ మొదలవనుంది. వారం రోజులు గ్యాప్ రావడంతో ఈ టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు వచ్చాయి. దీంతో కొందరు విదేశీ ప్లేయర్లు వ్యక్తిగత కారణాలు, అంతర్జాతీయ మ్యాచులు, గాయాల కారణంగా కొన్ని మ్యాచులు మిస్ అవనున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిప్లేస్‌మెంట్ కోసం కొత్త ప్లేయర్లను తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని కోసం బీసీసీఐ కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మిగిలిన ఐపీఎల్ మ్యాచుల కోసం ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్లతో తాత్కాలికంగా ఒప్పందాలు చేసుకోవడానికి బీసీసీఐ అంగీకరించింది.

గతంలో ఆయా జట్ల ప్లేయర్లు గాయం లేదా అనారోగ్యం వల్ల లీగ్‌ నుంచి తప్పుకుంటేనే వేరే ప్లేయర్లతో వారిని రిప్లేస్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిబంధనలు మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్న ప్లేయర్లను వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకునే అవకాశం ఉండదని, వారు ఐపీఎల్‌లో ఆడాలనుకుంటే మినీ వేలంలో పాల్గొనాల్సిందేనని బీసీసీఐ స్పష్టంచేసింది.

Next Story