AB de Villiers: మిస్టర్ 360 గొప్ప మనసు.. వీల్‌చైర్ క్రికెట్ ఆడిన ఏబీ డివిలియర్స్ వీడియో వైరల్

by Ramesh Naini |

సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 పిలువబడే లెజెండరీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ వీల్ చైర్ క్రికెట్ ఆడి అదుర్స్ అనిపించారు.

AB de Villiers: మిస్టర్ 360 గొప్ప మనసు.. వీల్‌చైర్ క్రికెట్ ఆడిన ఏబీ డివిలియర్స్ వీడియో వైరల్
X

దిశ , డైనమిక్ బ్యూరో: సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 పిలువబడే లెజెండరీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) వీల్ చైర్ క్రికెట్ ఆడి అదుర్స్ అనిపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంటే తాను కచ్చితంగా భారత్‌కు వస్తానని చెప్పిన ఈ ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఇచ్చిన మాట ప్రకారం భారత్‌కు వచ్చారు. తాజాగా (Mumbai Wheelchair Cricket Team) ముంబాయిలో వీల్‌చైర్ క్రికెట్ జట్టుతో ఆయన క్రికెట్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. జింఖానా గ్రౌండ్‌లో ముంబాయి వీల్‌చైర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ గేమ్ ఆడుతోంది. శారీరక వైకల్యం కలిగిన వారు వీల్ చైర్లను ఉపయోగించి ఈ క్రికెట్ ఆడతారు.

ఈ క్రమంలోనే ఏబీ డివిలియర్స్ వీల్ చైర్‌ను ఉపయోగించి బ్యాట్‌తో బంతిని కొట్టి వీల్ చైర్‌తోనే రన్స్ తీశారు. వారితో ఉత్సాహంగా వీల్ చైర్ క్రికెట్ ఆడుతూ అందరి మనసు దోచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మిస్టర్ 360 ఏబీడీకి గొప్ప మనసు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శారీరక వైకల్యం కలిగిన వారు ఆటగాళ్లు వారి వీల్ చైర్‌లను ఉపయోగించి బంతిని కొట్టడం, బౌలింగ్ చేయడం, ఫీల్డింగ్ చేయడం ద్వారా ఈ గేమ్ ఆడుతారు. వైకల్యం గల వ్యక్తుల క్రీడల ప్రాముఖ్యతలో భాగంగా సామాజికంగా, శారీరకంగా వారు సంతోషం పొందడానికి, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి భారత వీల్ చైర్ క్రికెట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ గేమ్ నిర్వహిస్తున్నారు.

కాగా, ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో 11 ఏళ్లు (Royal Challengers Bengaluru) ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించారు. 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ జట్టు తరఫున ఆడారు. విరాట్ కోహ్లీతో ఏబీడీకి ఎన్నో చిరస్మరణీయ పార్టనర్షిప్‌లు ఉన్నాయి. ఈ ఐపీఎల్-2025 (Indian Premier League) సీజన్‌లో ఆర్సీబీ జట్టు ఫైనల్‌కు చేరడంతో తను భరత్‌లో పర్యటిస్తున్నారు. విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ఎత్తడం కంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని, తను కొన్నేళ్లుగా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నానని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడారు.

Next Story