ముంబైలో బ్రెట్ లీ కారును వెంబడించిన ఇద్దరు యువకులు (వీడియో)

by Disha Web Desk 4 |
ముంబైలో బ్రెట్ లీ కారును వెంబడించిన ఇద్దరు యువకులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ బ్రెట్ లీ కారును ఇద్దరు యువకులు వెంబడించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్ 2023లో ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్ లో బ్రెట్ లీ కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ముంబై వీధుల్లో కారులో వెళ్తున్న సమయంలో ఇద్దరు యువకులు అతన్ని స్కూటీపై వెంబడించారు. ఈ వీడియోను ట్విట్టర్ లో బ్రెట్ లీ పంచుకున్నారు. వీడియోలో ఇద్దరు యువకులు తన కారును ఫాలో అవుతూ సెల్ఫీ దిగేందుకు ఛాన్స్ ఇవ్వడంటూ రిక్వెస్ట్ చేశారు. స్పందించిన బ్రెట్ లీ హెల్మెట్ ధరించండి వారికి సూచించాడు. ఇండియా ఎప్పుడు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుందన్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రెట్ లీ ఎదుట మీరెప్పుడు హెల్మెట్ ధరించాల్సిందే అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story

Most Viewed