శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

by Dishanational3 |
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 అగ్రస్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా ఆసక్తికర పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ముందు కోల్‌కతా 224 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. టాస్ నెగ్గిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి రెచ్చిపోవడంతో కేకేఆర్‌కు భారీ స్కోరు దక్కింది. రాజస్థాన్ బౌలర్లను ఊతికారేసిన అతను శతకంతో చెలరేగాడు. 55 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. ఆ తర్వాత రఘువంశీ(30), రింకు సింగ్(20 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీశారు. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌కు ఒక్క వికెట్ దక్కింది.


Next Story

Most Viewed