IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

by Disha Web Desk 13 |
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఎయిడెన్ మార్క్రమ్ జట్టు సభ్యులతో డిస్కస్ చేస్తున్న ఫొటోలను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రారంభ మ్యాచ్‌ల్లో.. నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్ కారణంగా చాలా మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వారి సంబంధిత ఐపీఎల్ జట్లకు చేరుకోలేకపోయారు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ఏప్రిల్ 2వ తేదీన ముగిసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఎయిడెన్ మార్క్రమ్ గైర్హాజరీతో భువనేశ్వర్ కుమార్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్‌లు కూడా హైదరాబాద్‌కు ఆడనున్నారు.



Next Story

Most Viewed