IPL 2023: సన్‌రైజర్స్‌ ప్లేయర్‌ అరుదైన రికార్డు..

by Disha Web Desk 13 |
IPL 2023: సన్‌రైజర్స్‌ ప్లేయర్‌ అరుదైన రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టులోకి వచ్చిన ఫిలిఫ్స్ రాజస్తాన్ మ్యాచ్‌లో 7 బంతుల్లో 25 పరుగులతో చెలరేగాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాది సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్‌తో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సాధించాడు. ఓ మ్యాచ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు.

ఈ క్రమంలో బౌలర్‌ నువన్‌ కులశేఖర పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఫిలిప్స్‌ 7 బంతుల్లో 25 పరుగులతో టాప్‌నకు చేరుకోగా.. సీఎస్‌కే తరఫు పుణెతో మ్యాచ్‌లో నువన్‌ 2012లో 2/10 బౌలింగ్‌ గణాంకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్‌ తరఫున రెండో ఆటగాడిగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ మరో రికార్డు సృష్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు (357.14 - 25 (7) - గ్లెన్‌ ఫిలిప్స్‌) నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.

Next Story