IPL 2023: నేడు ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ ఢీ..

by Disha Web Desk 13 |
IPL 2023: నేడు ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడునుంది. పాయింట్స్ టేబుల్‌లో వరుసగా ఆర్సీబీ, ముంబై 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముంబై జట్టు.. పది మ్యాచ్‌లో 5 గెలిచి.. 10 పాయింట్స్‌తో 6 వ స్థానంలో ఉన్నది. మరోవైపు ఆర్సీబీ జట్టు.. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లో 5 గెలిచి.. రన్ రేట్‌లో ముంబై కంటే మెరుగ్గా ఉండటంతో 5 వ స్థానంలో కొనసాగుతున్నది. ముంబై జట్టు చివరి పోరులో CSK చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోగా, RCB 7 వికెట్ల తేడాతో DC చేతిలో ఓడిపోయింది. రెండు జట్లకు ప్లేఆఫ్‌ చేరేందుకు ఈ మ్యాచ్‌ కీలకం.

ముంబై ఇండియన్స్ తుదిజట్టు (అంచనా):

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, అర్షద్ ఖాన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా):

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్


Next Story

Most Viewed