టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

by Dishafeatures2 |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్: ముంబయి ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడి 8 గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందంజలో ఉంది గుజరాత్. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో ఉండాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన ముంబై జట్టు.. 6 గెలిచి 12 పాయింట్లు సాధించింది. గుజరాత్ పై గెలిస్తే ముంబై ఇండియన్స్ పై ఒత్తిడి తగ్గుతుంది. లేకుంటే తన చివరి రెండు మ్యాచ్ లలో లక్నో, హైదరాబాద్ తో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి.

జట్ల వివరాలు

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్



Next Story

Most Viewed