వావ్.. గ్రేట్ ఫైనల్: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

by Dishafeatures2 |
వావ్.. గ్రేట్ ఫైనల్: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 మ్యాచ్ పై సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ స్పందిస్తున్నారు. గెలుపెవరిదైనా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ సాగిన ఫైనల్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక చివరి రెండు బంతుల్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి సీఎస్కేను గెలిపించిన జడేజాను క్రికెట్ లవర్స్ ఆకాశానికెత్తుతున్నారు. కాగా గుజరాత్ టైటాన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ నిజంగా గ్రేట్ ఫైనల్.. సీఎస్కేకు నా అభినందనలు. వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్ మంచి కంబ్యాక్ ఇస్తుందని కోరుకుంటున్నా’’ అని కామెంట్ చేశారు.


Next Story

Most Viewed