TATA IPL 2023: పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్

by Dishafeatures2 |
TATA IPL 2023: పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్
X

దిశ, వెబ్ డెస్క్: గుజారాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టైటాన్స్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లలో పృథ్విషా 7 పరుగులు మాత్రమే చేసి జట్టు స్కోర్ 29 వద్ద అవుటయ్యాడు. ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన మార్ష్ 4 పరుగులు మాత్రం చేసి షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 37 పరుగులు చేసి కుదురుకున్నాడు అనుకున్న సమయలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ జోసెఫ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

ఇక అనంతరం వచ్చిన రూసో జట్టు స్కోర్ 67 వద్ద జోసెఫ్ బౌలింగ్ లో డకౌట్ అయి వెనుదిరిగాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ (12), అభిషేక్ (3) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం జట్టు స్కోర్ 78 కాగా 10 ఓవర్లు పూర్తయ్యాయి.


Next Story

Most Viewed