- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినాయకుని నిమజ్జనం చూసి వస్తూ ఇద్దరు యువకులు మృతి
by Bhoopathi Nagaiah |
జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపెళ్లి గ్రామంలో వినాయక నిమజ్జనం పండగ వేళ విషాదం నెలకొంది.

X
దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపెళ్లి గ్రామంలో వినాయక నిమజ్జనం పండగ వేళ విషాదం నెలకొంది. నిన్న రాత్రి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మెకార్తి రవితేజ (18), కార్తిక్ (17) జగిత్యాలలో వినాయక నిమజ్జనాన్ని చూసి బైక్ పై వస్తుండగా చల్ గల్ శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తిక్ అక్కడే మృతి చెందగా, రవితేజను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story






