- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎంపీ వైద్యుడి ఇంట్లో చోరీ.. వైద్యం చేసి వచ్చేలోగా అంత మాయం
by Chintha Aamani |
రాత్రి 8:30 గంటల సమయంలోనే తాళం వేసిన ఇంట్లో దొంగలు

X
దిశ, లోకేశ్వరం: రాత్రి 8:30 గంటల సమయంలోనే తాళం వేసిన ఇంట్లో దొంగలు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఏ ఎస్ ఐ దిగంబర్ తెలిపిన వివరాల ప్రకారం లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన వాసం వెంకటేష్ అనే ఆర్ఎంపీ వైద్యుడు మండలంలోని గడ్ చందా గ్రామానికి ప్రాథమిక చికిత్స చేయడానికి ఇంటికి తాళం వేసి 4:45 నిమిషాలకు బయలుదేరి వెళ్ళాడు. తిరిగి 8:30 గంటల ప్రాంతంలో ఇంటికి రాగా ఇల్లు తాళం పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఇంట్లో దాచిన 15 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏఎస్ఐ దిగంబర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి వివరాలు సేకరించారు.
Next Story






