జాబ్ కోసం ఇంటర్వ్యూ కి వెళ్లిన యువతి..డోర్ లాక్ చేసి దారుణం!

by Disha Web Desk 18 |
జాబ్ కోసం ఇంటర్వ్యూ కి వెళ్లిన యువతి..డోర్ లాక్ చేసి దారుణం!
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం పేరుతో ఓ యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థ మేనేజర్. వివరాల్లోకి వెళితే..మధురా నగర్‌లో టెక్ ఫ్లో అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం కోసం ఓ యువతి దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు యువతికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. దీంతో ఆ యువతి మధురా నగర్ లోని ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. అనంతరం మేనేజర్ నవీన్ కుమార్ కంగ్రాట్స్ మీరు ఉద్యోగానికి ఎంపిక అయ్యారని చెప్పాడు. ఇక ఉద్యోగంలో జాయిన్ కావాలంటే ఆఫీస్ సిమ్‌కార్డ్ అవసరమని చెప్పాడు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఆ యువతికి మేనేజర్ పై ఎలాంటి అనుమానం రాలేదు.

కాగా ఈ నేపథ్యంలోనే తనకు మాయమాటలు చెప్పిన మేనేజర్ తాను ప్రస్తుతం బిజీగా ఉన్నానని చెప్పి సిమ్‌కార్డు కోసం రేపు మా ఇంటికి రావాలని చేప్పాడు. ఈ సాకుతో యువతిని తన ఇంటికి పిలిపించుకున్నాడు మేనేజర్. ఆమె లోపలికి రాగానే డోర్ లాక్ చేసి యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో యువతి కేకలు వేయడంతో చంపుతానని బెదిరించాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకోన్న ఆ యువతి నేరుగా మధురా నగర్ పోలీస్ స్టేషన్‌కి చేరుకుంది. మేనేజర్ నవీన్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువత ముఖ్యంగా మహిళలు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed