- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వైద్యం వికటించి యువకుడు మృతి..
దిశ, మేడిపల్లి : వైద్యం వికటించి యువకుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి జేపీ హాస్పిటల్ లో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ కి చెందిన పంజాల అజయ్ (32), తండ్రి రవి, గత నాలుగు నెలల ముందు తండ్రి రవి చనిపోవడంతో కుమారుడు అజయ్ డిప్రెషన్ లో ఉన్నాడు. పీర్జాదిగూడ ముత్యవల్లి గూడలో నివాసం ఉండే తన చెల్లె వద్దకు మనశ్శాంతి కోసం వచ్చాడు. ఈ నెల 15న అజయ్ సడన్ గా బాత్రూంలో పడిపోవడంతో గమనించిన బంధువులు శబరిగార్డెన్ దగ్గరలో గల కృష్ణ సాయి హాస్పిటల్ కార్డియాలాజి వద్దకు వెళ్లగా న్యూరో ప్రాబ్లమ్ ఉందని పీర్జాదిగూడలో గల జేపీ హాస్పిటల్ కు వెళ్ళమని చెప్పడంతో వారు ఇక్కడకు వచ్చారు.
తలకు ఆపరేషన్ చేసి వైద్యం అందిస్తున్నారు. బుధవారం ఉదయం అజయ్ చనిపోయాడని వైద్యులు బందువులకు చెప్పడంతో, ఇప్పుడే మంచిగా ఉన్నాడని చెప్పి ఎలా చనిపోయాడు అంటూ వైద్యుల నిర్లక్ష్యంతోనె చనిపోయాడని హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఇప్పటికి 3 లక్షలు డబ్బు కట్టమని, బయట వేరే హాస్పిటల్ కు వెళ్తామని చెప్పిన పంపించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. భర్తను పోగొట్టుకునికి దుఃఖంలో ఉంటే ఇప్పుడు కొడుకు కూడా లేడంటూ తల్లి తల్లడిల్లుతుంది. హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య అధికారిని బంధువులు కోరుతున్నారు.
జేపీ హాస్పిటల్ లో వరుస మరణాలు...
జేపీ హాస్పిటల్ పీర్జాదిగూడలో ప్రారంభించిన నాటి నుండి ఏదొక వివాదంలో ఉంటూనే ఉంది. వరుస మరణాలతో రికార్డ్ కు ఎక్కనుంది. బంధువులకు ప్రతీసారి పైసలు అప్పగించి మేనేజ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో జిల్లా వైద్య అధికారి విచారణ జరిపించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
డాక్టర్ ఉదయ్ మత్తు వైద్యుని వివరణ.. : హాస్పిటల్ కు వచ్చే సమయంలోనె సీరియస్ గా ఉందని, ప్రయత్నం మాత్రమే చేస్తామని రోగి కండిషన్ ను బంధువులకు వివరించాము. ఈ రోజు గుండె నొప్పి రావడంతో అజయ్ చనిపోయాడని చేయవలసిన వైద్యం అందించామని తెలిపారు.