- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident : బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు…యువకుడు స్పాట్ డెడ్
by Taduka Kalyani |
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సత్తుపల్లి - కిష్టారం వై జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది.

X
దిశ,సత్తుపల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం సత్తుపల్లి - కిష్టారం వై జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలం పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన తాటి. శ్రీ రామ్ (25)ను సత్తుపల్లి డిపోకు చెందిన TS 04 UD 0892 ఆర్టీసీ అద్దె బస్సు ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా… వై జంక్షన్ సమీపంలో బస్సును ఓవర్ టెక్ చేస్తున్న తరుణంలో బైక్ పై వెళుతున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి కి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ సంఘటన పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






