- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
by Sumithra |
X
దిశ, కూకట్పల్లి : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల కాలనీ సమీపంలోని ఐడీపీఎల్ అడవిలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బాలానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంకు చెందిన కాలే దినేష్ (32) గత కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో రంగరెడ్డినగర్, పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నాడు.
దినేష్ రాపిడో, స్విగ్గి డెలివరీ బాయ్గా పని చేస్తుండే వాడు. ఆదివారం పంచశీల కాలనీ సమపంలోని ఐడీపీఎల్ అడవిలోని ఖాళీ ప్రదేశంలో దినేష్ మృతదేహం లభ్యమయింది. దినేష్ ముఖం, తల భాగంలో గాయాలతో రక్తం మడుగులో పడి ఉండటంతో దినేష్ను ఎవరైనా హత్య చేసి ఉండవచ్చు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దినేష్ భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బాలానగర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
Next Story